కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు దక్షిణ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.ఫ్లాట్‌ఫాం టికెట్లను 50రూపాయల వరకు పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది. ఫ్లాట్‌ఫాంపై రద్దీని నివారించేందుకే ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుండటంతోనే ఫ్లాట్‌ఫాం టికెట్లను పెంచామని.. కరోనా ప్రభావం తగ్గాక పాత రేట్లను అమలు చేస్తామని ప్రకటించారు. 250 స్టేషన్లలో పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని తెలిపారు.