బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో మూడవ టెస్టు మార్చి1న జరగనుంది. ఈ సిరీస్ లో టీమిండియా 2-0తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ ఎగురేసుకు పోవాలని భారత్ జట్టు ఉత్సాహంతో ఉరకలేస్తోంది. ఎలాగైనా ఈ మ్యాచ్ లో విజయం సాధించి వరుసగా నాల్గోసారి ఈ ట్రోపిని గెలుచుకోవాలని ప్రయత్నిస్తోంది.
ఈ మ్యాచ్‌లో గెలిస్తే టెస్టు ర్యాంకిగ్స్ లో భారత జట్టు అగ్రస్థానానికి చేరుకుంటుంది. ప్రస్తుతం ఆసిస్ జట్టు నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో టీమిండియా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాకు 126, భారత్ 115 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.
ఈ సిరీస్‌లో ఇప్పటికే భారత జట్టు 2-0 ఆధిక్యంలో నిలిచి సత్తా చాటింది. ఇండోర్ టెస్టులోనూ ఇదే ఊపు కొనసాగించి విజయాన్ని అందుకుంటే రేటింగుల్లో మార్పులు వస్తాయి. ఈ మ్యాచ్ గెలిస్తే టీమిండియాకు 121 రేటింగ్ పాయింట్లు, ఆస్ట్రేలియాకు 119 పాయింట్లు ఉంటాయి.
దీంతో టెస్టులో భారత జట్టు అగ్రస్థానంలో నిలుస్తుంది. దీంతో పాటు భారత్ కు మరో మంచి అవకాశం కూడా దక్కుతుంది. ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్స్‌కు కూడా భారత్ కు చేరుకోవచ్చు. దీంతో ఈ మ్యాచ్ లో గెలిచి ఆ రెండు అవకాశాలను అందుకోవాలని టీమిండియా భావిస్తోంది.