నాగ్ పూర్ స్టేడియంలో బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభమైంది. గురువారం మొదలైన ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. ఈ టెస్టులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగింది. లంచ్ బ్రేక్ సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది.
ఆసిస్ తరపున మొదట బ్యాటింగ్ కు డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజాలకు టీమిండియా బౌలర్సర్ ష్మీ, సిరాజ్ చుక్కలు చూపించారు. ఇన్నింగ్స్ లోని మొదటి ఓవర్ లో మహ్మద్ సిరాజ్ వేసిన తొలి బంతికే ఉస్మాన్ ఖావాజా వికెట్ తీశాడు. ఈ బాల్ ను ఊహించని ఖవాజా లెగ్ సైడ్ ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు.
దీంతో బాల్ అతని ప్యాడ్స్ కు తగిలింది. అయితే ఇండియన్ ప్లేయర్స్ గట్టిగా అప్పీల్ చేసినా అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. దీంతో టీమిండియా రివ్యూ తీసుకుంది. రీప్లేలో బంతి లెగ్ స్టంప్ కు తగిలినట్లు స్పష్టంగా తేలింది. దీంతో ఖవాజా స్కోర్ నమోదు చేయకుండానే పెవిలియన్ బాట పట్టాడు.
ఆ తర్వాత ఓవర్లో డేవిడ్ వార్నర్ ను ఔట్ చేశాడు షమీ. షమీ వేసిన సూపర్ గుడ్ లెంగ్త్ బాల్ ను ఏ మాత్రం అడ్డుకోలేకపోయాడు వార్నర్. డిఫెన్స్ ఆడబోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కాగా మెరుపు వేగంతో వచ్చిన బంతి వికెట్లను తాకడంతో స్టంప్ గాల్లో ఎగిరిపడింది. దీంతో షాక్ అయిన వార్నర్ (1) నిరాశగా పెవిలియన్ వైపు దారి పట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
𝑰. 𝑪. 𝒀. 𝑴. 𝑰!
1⃣ wicket for @mdsirajofficial 👌
1⃣ wicket for @MdShami11 👍Relive #TeamIndia‘s early strikes with the ball 🎥 🔽 #INDvAUS | @mastercardindia pic.twitter.com/K5kkNkqa7U
— BCCI (@BCCI) February 9, 2023