టీ-20 వరల్డ్ కప్‌లో భారత్‌కు పరాజయం ఎదురైంది. సెమీఫైనల్‌లో ఓడి భారత్ ఇంటి దారి పట్టింది. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో భారత్ ఓడిపోయింది. దీంతో భారత్ కు నిరాశే మిగిలింది.
భారత్ నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ జట్టు సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు హేల్స్, బట్లర్ లు బ్యాటింగ్‌లో చెలరేగి పోయారు. సిక్స్ ల, ఫోర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
అలెక్స్ హేల్స్(86 నాటౌట్), జోస్ బట్లర్(80 నాటౌట్) బ్యాటింగ్ లో విజృంభించారు. దీంతో మరో నాలుగు బంతులు మిగిలి వుండగానే ఇంగ్లాండ్ జట్టు విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.
భారత జట్టులో హార్దిక్ ప్యాండ్యా (63), విరాట్ కోహ్లీ(50)లు రాణించారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (27) ఫర్వాలేదనిపించాడు. కేఎల్ రాహుల్ (5), రిషభ్ పంత్ (6), సూర్యకుమార్ (14) పెద్దగా రాణించలేదు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ జొర్డాన్ 3, క్రిస్ వోక్స్, అదిల్ రషీద్ చెరో వికెట్ తీశారు.