మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ విశ్వరూపం ప్రదర్శంచాడు. ఇండోర్ గ్రౌండ్ లో ఊర మాస్ ఇన్నింగ్స్ తో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో అందని ద్రాక్షలా ఉన్న సెంచరీని అందుకున్నాడు.
2020 జనవరి 19న ఆస్ట్రేలియాపై చివరిసారిగా వన్డేల్లో శతకం బాదిన రోహిత్ శర్మ.. మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ 50 ఓవర్ల ఫార్మాట్ లో సెంచరీ బాదాడు. మూడో వన్డేలో టాస్ నెగ్గిన న్యూజిలాండ్ కెప్టెన్ లేథమ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన శుబ్ మన్ గిల్, రోహిత్ శర్మలు రెచ్చిపోయి ఆడారు.
ముఖ్యంగా రోహిత్ శర్మ సిక్సర్లు వర్షం కురిపించాడు.గత కొంతకాలంగా బిగ్ ఇన్నింగ్స్ లు ఆడటంలో విఫలం అవుతున్నడన్న అపవాదును చెరిపేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో టిక్నర్ బౌలింగ్ లో సింగిల్ తీసిన రోహిత్ మూడేళ్ల తర్వాత వన్డేల్లో శతకాన్ని బాదాడు.
రోహిత్ శర్మ 83 బంతుల్లో 100 పరుగుల మార్కును అందుకున్నాడు. ఇందులో 6 భారీ సిక్సర్లు ఉండగా.. 9 ఫోర్ లు ఉన్నాయి. మరో ఎండ్ లో ఉన్న శుబ్ మన్ గిల్ కూడా సెంచరీ బాదేశాడు.రోహిత్ కు వన్డేల్లో ఇది 30వ వన్డే సెంచరీ కావడం విశేషం. గిల్, రోహిత్ శర్మ దాటికి భారత్ కేవలం 24.1 ఓవర్లలోనే 200 మార్కును దాటింది. ఇదే దూకుడును ప్రదర్శిస్తే భారత్ 450 పరుగులు చేసే అవకాశం ఉంది.