స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ 20 సిరీస్ గెలిచిన టీమిండియా వన్డే సిరీస్ లోనూ అదే ఊపును కొనసాగించింది. మూడు వన్డేల సిరీస్ ను భారాత్ 2-1 ఆధిక్యంతో సొంతం చేసుకుంది. మూడవది, చివరిదైన వన్డే మ్యాచ్‌లో ఈ రోజు దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ సిరీస్‌ను గెలుచుకుంది.
ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు బారత్ ముందు 99 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టుకు ఓపెనర్ శుభమన్ గిల్ (49) శుభారంభాన్ని ఇచ్చాడు.
మరోశిఖర్ ధవన్ (8) నిరాశ పరిచాడు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ (10) కూడా తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. అనంతరం శ్రేయాస్ అయ్యర్ (28 నాటౌట్) చక్కని సహకారం అందించాడు. ఆ తర్వాత సంజూ శాంసన్ తో కలిసి శ్రేయస్ అయ్యర్ భారత్ ను విజయ తీరాలకు చేర్చాడు. 19.1 ఓవర్లలో భారత్ విజయ లక్ష్యాన్ని చేరుకుంది.
అంతకు ముందు బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా జట్టులో బ్యాటర్లు చెప్పుకోదగ్గ ఆట తీరు ప్రదర్శించలేదు. బ్యాటర్లు ఒకరి వెనుక ఒకరు క్యూ కట్టారు. దీంతో 27.1 ఓవర్లలో దక్షిణాఫ్రికా జట్టు 99 పరుగులకే ఆలౌట్ అయింది.
దక్షిణాఫ్రికా బ్యాటర్లలో క్లాసిన్ (34) మాత్రమే చెప్పుకోదగిన పరుగులు చేశారు. పరుగులు మదక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎన్గిడీ, బ్యోర్న్ ఫోర్టూయిన్ చెరో వికెట్ తీశారు. భారత బౌలర్లలో కులదీప్ యాదవ్ 4, వాషింగ్టన్ సుందర్, సిరాజ్, అహ్మద్ లు రెండేసి వికెట్లు తీశారు.