భారత్ చైనాలు యుద్ధానికి రెడీ అవుతున్నాయా… అన్నట్లుగా సరిహద్దు రేఖ వద్ద పరిస్థితులు మారిపోయాయి. ఇరు దేశాల యుద్ధ ట్యాంకులు అతి చేరువకు వచ్చినట్లు ప్రచారం సాగుతుంది. ప్యాంగాంగ్ లోయ వద్ద గత నాలుగు రోజులుగా ఇరు దేశాల సైన్యం మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది.
పాంగాంగ్ వద్ద అతి ఎత్తైన ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవటం వల్ల భారత్ కదలికలను కనిపెట్టవచ్చన్న కుటిల బుద్ధితో చైనా సైన్యం ముందుకు వచ్చినట్లు భారత వర్గాలు తెలిపాయి. దీంతో అలర్ట్ అయిన సైన్యం చైనా కన్నా ముందే లోయలోని ఎత్తైన ప్రాంతాలను స్వాధీనం చేసుకుందని, ఇందులో స్పెషల్ ప్రాంటియర్స్ ఫోర్స్ వేగంగా స్పందించి, సక్సెస్ అయినట్లు ఆర్మీ వర్గాలంటున్నాయి. అప్పటికే చైనా ఏర్పాటు చేసుకున్న నిఘా కెమెరాలను కూడా వీరు ద్వంసం చేశారని తెలిపింది. దీంతో చైనా ఆర్మీ యుద్ధ ట్యాంకులను రంగంలోకి దింపగా, భారత్ కూడా అంతే వేగంగా టి-72, టి-90 ట్యాంకులను రంగంలోకి దించింది. దీంతో భారత్ స్పాంగూర్ గ్యాప్ పై పైచేయి సాధించినట్లయిందని, తద్వారా ఆ లోయ మొత్తం ఏం జరుగుతుందో వెంటనే కనిపెట్టే అవకాశం భారత్ కు దక్కిందంటున్నారు. ఈ లోయలో చైనా ఓ రోడ్డు నిర్మాణం చేసిందని, అక్కడ భారీగా సైన్యంతో పాటు యుద్ధ ట్యాంకర్లు ఉన్నట్లు భారత్ తాజాగా గుర్తించింది.
పాంగాంగ్ సౌత్ లో భారత చర్యలన్నీ ఆత్మరక్షణ కోసమేనని, చైనా దళాల యాక్షన్ బట్టి తమ రియాక్షన్ ఉంటుందని భారత ఆర్మీ వర్గాలు స్పష్టం చేశాయి. ఎల్ఎసీ వద్ద జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నామని, దూకుడే సరైన నిర్ణయంగా భారత్ భావిస్తుందని భారత రక్షణ శాఖ వర్గాలంటున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమీక్ష నిర్వహించాఉ.