బ్రిటన్ లో కొత్త రకం కరోనా స్ట్రెయిన్ అత్యంత వేగంగా విజృంభిస్తోంది. ఇంగ్లాండ్ లోని పలు ప్రాంతాల్లో మళ్లీ లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో భారత్ అప్రమత్తమైంది.
అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలున్న నేపథ్యంలో పలు దేశాలు ఎయిర్ బబుల్ ఒప్పందాలు చేసుకున్నాయి. దీంతో ఆ దేశాల మధ్య మాత్రమే ప్రయాణాలు కొనసాగుతున్నాయి. ఈ ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగా భారత్-ఇంగ్లాండ్ లు కూడా ఒప్పందాలు చేసుకున్నాయి.
అయితే, బ్రిటన్ లో కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుండి ఈ నెలాఖరు వరకు బ్రిటన్ నుండి రావాల్సిన అన్ని విమానాలపై నిషేధం విధిస్తూ పౌరవిమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.