దేశంలో కరోనా వ్యాక్సిన్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రతి రోజు 50వేల కొత్త కేసులు నమోదవుతుండటంతో… కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దేశంలో వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతుండటం, కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ నిల్వలు కనిష్టస్థాయికి చేరటంతో ఇటువైపు ఫోకస్ పెంచింది.
ముఖ్యంగా అస్ట్రాజెనికా తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఎగుమతులను తాత్కాలికంగా అదుపు చేసింది. భారత్ నుండి ప్రస్తుతం 180దేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి అవుతుంది. 60.5మిలియన్ల డోసులు ఎగుమతి అయ్యాయి.
కానీ ఇండియాలో కేసులు పెరుగుతుండటంతో… ఎక్కువ డోసులు ఎగుమతి అయ్యే దేశాలకు కొంత కోత విధించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ డోసులను ఇండియాలో ఇచ్చే విధంగా కేంద్రవైద్యారోగ్యశాఖ రోడ్ మ్యాప్ రూపోందించే పనిలో ఉంది. అందుకే ఏప్రిల్ 1 నుండి వ్యాధులతో సంబంధం లేకుండా 45ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. అవసరం అయితే వ్యాక్సిన్ ఎగుమతులను పూర్తిగా నిషేధించాలని, దేశంలో వ్యాక్సిన్ ఎక్కువ మందికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇండియాలో కరోనా కేసులు అదుపులోకి వచ్చే వరకు వ్యాక్సిన్ ఎగుమతులు నిలిచిపోయే అవకాశాలున్నాయి.