అద్భుతం.. అత్యద్భుతం.. ఇది భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయం.. తొలిసారి థామస్ కప్ విజేతగా నిలిచింది భారత్. ఫైనల్ లో మనోళ్లు కుమ్మేశారు. ఐదింట మూడు గెలిచి భారత్ కు థామస్ కప్ అందించారు.
ఇండోనేసియాతో జరిగిన ఫైనల్లో శ్రీకాంత్, ప్రణయ్, లక్ష్యసేన్ సత్తా చాటారు. 14 సార్లు విజేతగా నిలిచిన ఇండోనేషియాను ఈసారి చిత్తుచేశారు. ఈ టోర్నీలో శ్రీకాంత్, ప్రణయ్ స్థిరంగా రాణించినా.. లక్ష్యసేన్ అంచనాలను అందుకోలేకపోయాడు. అయితే.. ఫైనల్ లో అందరూ ఇరగదీయడంతో భారత్ కు విజయం దక్కింది.
ఇరు దేశాల ఆటగాళ్ల మధ్య టైటిల్ కోసం ఐదు మ్యాచ్ లు జరిగాయి. వాటిలో భారత్ మూడు గెలిచింది. ఫలితంగా థామస్ కప్ విజేతగా నిలిచి స్వర్ణం సాధించింది.
ఇక ఈ విజయంపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. థామస్ కప్ గెలుచుకోవడం పట్ల దేశం మొత్తం గర్వపడుతోందన్నారు. భారత బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించిందని చెప్పారు. ఈ విజయం చాలా మంది రాబోయే క్రీడాకారులను ప్రేరణనిస్తుందని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో కొనియాడారు ప్రధాని.