2020 కొత్త సంవత్సరం వస్తూ వస్తూనే 67,385 మంది శిశువులను ఈ దేశంలోకి తీసుకొచ్చింది. ఇది ప్రపంచంలోనే అత్యధికం. కొత్త సంవత్సరం పుట్టిన వారిలో భారతదేశం తర్వాత చైనాలో 46,299, నైజీరియాలో 26,039, పాకిస్థాన్ లో 16,020, అమెరికాలో 10,452 మంది ఉన్నారు. యునిసెప్ ఈ వివరాలను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా కొత్త సంవత్సరం రోజు 3,92,078 మంది జన్మిస్తుంటారు. వారిలో 17 శాతం మంది భారతదేశం నుంచి ఉంటున్నట్టు యునిసెప్ అంచనా వేసింది.
2020 సంవత్సరంలో ముందుగా జన్మించిన బేబీ ఫిజీ దేశానికి చెందినది కాగా..చివరి బేబీ అమెరికాలో పుట్టింది. కొత్త సంవత్సరం రోజు పిల్లలను కనడానికి కొంత మంది గర్భిణులు సిజేరియన్ ఆపరేషన్ చేయించుకుంటున్నట్టు డాక్టర్లు తెలిపారు. కొందరు మాత్రం కొత్త సంవత్సరం రోజే తమ పిల్లలు కలగాలని కోరుకుంటున్నారు.