దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్నటితో పోలిస్తే.. మరికొంత దిగొచ్చాయి. నిన్న దేశవ్యాప్తంగా 26 వేలమంది కరోనా బారినపడగా.. ఇవాళ 24 వేల కరోనా కేసులు వెలుగుచూశాయి. వీటితో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 99.56 లక్షలకు చేరుకుంది. అంటే కోటి మార్క్‌కు చేరేందుకు 44 వేల కేసుల దూరంలో కరోనా ఉంది.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 24,010 మంది కరోనా బారినపడ్డారు. మరోవైపు ఈ వైరస్‌కు చికిత్స పొందుతూ 355 మంది మరణించారు. వీరితో కలిపి ఇప్పటివరకు లక్షా 44 వేల 451 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు కరోనా బారినపడిన వారిలో 94.89 లక్షల మంది కోలుకున్నారు. మిగిలిన 3.22 లక్షల మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 18.86 లక్షల మంది కరోనాబారినపడ్డారు.ఆ తర్వాత కర్ణాటకలో 9 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లో 8.76 లక్షలు, తమిళనాడులో 8.02 లక్షలు, కేరళలో 6.83 లక్షలు, ఢిల్లీలో 6.11 లక్షల మంది ఈ మహమ్మారి బారినపడ్డారు.