భారత్ లో గడిచిన 24 గంటల్లో 11,649 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1,09,16,589కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 90 మంది మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,55,732కు పెరిగింది. ఇక ఇప్పటివరకు 1,06,21,220 మంది కోలుకోగా, దేశంలో 1,39,637 యాక్టివ్ కేసులున్నాయి. సెప్టెంబర్ నెలాఖరు నుంచి దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.
గడిచిన 24 గంటల్లో 18 రాష్ట్రాల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదుకాకపోవడం పెద్ద ఊరటనిచ్చే అంశం. దేశంలో ఇప్పటి వరకకు 82,85,295 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న కొద్ది… కేసుల సంఖ్య మరింత కంట్రోల్ లోకి వస్తుందంటున్నారు నిపుణులు.