ఇండియాలో కరోనా కేసుల ఉధృతి ఏమాత్రం కంట్రోల్ లోకి రావటం లేదు. ప్రతి రోజు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే రికవరీ కేసుల సంఖ్య పెరగటం కాస్త ఊరటనిస్తుంది. దేశంలో గడిచిన 24గంటల్లో 64,553కొత్త కేసులు రాగా, కరోనా వైరస్ కు మరో 1007మంది బలయ్యారు.
దేశంలో మొత్తం కేసుల సంఖ్య 24,61,190కి చేరగా, మరణాల సంఖ్య 48,040కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుండి 17,51,555మంది కోలుకోగా, 6,61,595మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా దేశవ్యాప్తంగా కరోనా నుండి 55,573మంది కోలుకున్నట్లు ఐసీఎంఆర్ నివేదిక విడుదల చేసింది.
ఇక దేశంలో కరోనా టెస్టుల సంఖ్య వేగం పెరిగింది. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 8.48లక్షల టెస్టుల చేయగా, ఇప్పటి వరకకు 2.76కోట్ల టెస్టులు చేశారు. ప్రతి 10లక్షల మందిలో 19,453మందికి టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది.