ఇండియాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24గంటల్లో 14,256 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా 17,130మంది కరోనాను జయించగా, మరో 152మంది కరోనాతో మరణించారు.
దేశంలో ఇప్పటి వరకు 1,53,184మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దేశంలో 1,85,662 యాక్టివ్ కేసులుండగా… 10,300,838మంది కరోనా నుండి కోలుకొని, డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకే దేశంలో 1,06,39,684మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
ఇక దేశంలో 13,90,592మందికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ తొలిడోసు అందింది.