దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 13,083కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,07,33,131కి చేరింది. కొత్తగా 14,808మంది డిశ్చార్జ్ కాగా… మరో 137మంది మరణించారు.
దేశంలో ఇప్పటి వరకు 1,54,147మంది కరోనా కారణంగా మరణించారు. ఇక దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,69,824కు పడిపోగా… 1,04,09,160మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
భారత్ లో ఇప్పటి వరకు 33లక్షలకు పైగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు భారత వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.