ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా మహమ్మారి మరోసారి ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 17,336 మంది వైరస్ భారిన పడ్డారు. మరో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 13,029 మంది కరోనానుండి కోలుకున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా నుండి కోలుకున్నా వారి మొత్తం సంఖ్య 98.60 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.19 శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తాజాగా బయటపడ్డ కేసులతో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 43,362,294 చేరిందని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు దేశంలో కరోనా కారణంగా 5,24,954 మృత్యువాతపడగా.. 88,284 యాక్టివ్ కేసులున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా నుండి 4,27,49,056 మంది కోలుకున్నారు.
పెరుగుతున్న కరోనా కేసులతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. దేశంలో గురువారం ఒక్కరోజే 13,71,107 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,96,77,33,217 కోట్లకు చేరింది. మరో 4,01,649 మందికి కరోనా టెస్టులు నిర్వహించినట్టు ఆరోగ్య శాఖ రోజువారి నివేదికలో పేర్కొన్నారు అధికారులు.
మరోవైపు ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోజే 7,25,222 మంది వైరస్ బారినపడ్డారు. మరో 1,650 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 547,326,664కు చేరుకోగా.. మరణాల సంఖ్య 6,347,476 కు చేరింది. గురువారం ఒక్కరోజే 463,579 మంది కరోనా నుండి కోలుకోగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 522,639,042 కు చేరుకుంది.