ఇండియాలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 26,115 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే తాజా గణాంకాల ప్రకారం మొత్తం కేసుల సంఖ్య 3,35,04,534 కి చేరింది.
ఇక ఇందులో 3,27,49,574 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 3,09,575 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. మరోవైపు గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 252 మంది మృతి చెందారు. ఇక దేశంలో ఇప్పటి వరకు మొత్తం 4,45,385 మంది కరోనాతో మృతి చెందారు.