ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ మొదలవుతుంది. కొన్ని దేశాల్లో భారత్ కన్నా ముందే వ్యాక్సినేషన్ ప్రారంభించారు. అయితే, ఇండియాలోనే అత్యంత భారీ స్థాయిలో వ్యాక్సినేషన్ జరుగుతోంది. మొదటి దశలో హెల్త్ వర్కర్స్‌కు టీకాలు వేశారు. కేవలం 13 రోజుల్లోనే దేశంలోని 30 లక్షల మందికి టీకాలు ఇచ్చారు. దీంతో అత్యంత వేగంగా ఎక్కువమందికి టీకాలు వేసిన దేశంగా భారత్ నిలిచింది. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం టీకాలు వేయడంతో భారత్… అమెరికాను అధిగమించింది. అమెరికాలో 30 లక్షల మందికి టీకాలు వేయడానికి 18 రోజులు పట్టింది.
ఇజ్రాయెల్‌లో 30 లక్షల మందికి టీకాలు వేయడానికి 33 రోజులు పట్టగా, బ్రిటన్ లో 36 రోజులు పట్టింది.
దేశంలో ఎక్కువ వ్యాక్సిన్ ఇచ్చిన రాష్ట్రాలివే
కర్నాటకలో 2,86,089
మహారాష్ట్రలో 2,20,587
రాజస్థాన్‌లో 2,57,833
ఉత్తరప్రదేశ్‌లో 2,94,959
ఇక వ్యాక్సినేషన్ లో తెలుగు రాష్ట్రాలు వెనుకంజలో ఉన్నాయి. తెలంగాణలో, ఏపీలో 2లక్షల లోపు మాత్రమే వ్యాక్సినేషన్ జరిగింది.