దేశవ్యాప్తంగా కొత్తగా 13,193 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో పోరాడుతూ మరో 97 మంది మరణించగా.. 10,896 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
దేశంలో మొత్తం కేసులు: 1,09,63,394
యాక్టివ్ కేసులు: 1,39,542
కోలుకున్నవారు: 1,06,67,741
మరణాలు: 1,56,111. అయితే, కొత్తగా వస్తున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుండే ఉంటున్నాయి. మహారాష్ట్రలో ప్రతిరోజు 4వేలకు పైగా కేసులు నమోదవుతుండగా, కేరళ రాష్ట్రంలోనూ కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.
దేశవ్యాప్తంగా కొవిడ్ టీకా పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 1,01,88,007కు చేరింది.