ఇండియాపై కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపుతూనే ఉంది. జనం జాగ్రత్తలు తీసుకుంటున్నా.. సర్కార్ కట్టడి చర్యలు చేపడుతున్నా.. వైరస్ మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 54 వేల 736 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా మరో 853 మంది చనిపోయారు.
తాజా కేసులతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17 లక్షల మార్క్ దాటేసింది. ఇప్పటివరకు 17 లక్షల 50 వేల 724 మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. ఇందులో 11 లక్షల 45 వేల 630 మంది కోలుకోగా.. 5 లక్షల 67 వేల 730 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా కారణంగా 37 వేల 364 మంది మృతి చెందారు.
నిన్న దేశవ్యాప్తంగా 4 లక్షల 63 వేల172 టెస్టులు నిర్వహించగా.. ఇప్పటి వరకు కోటీ 98 లక్షల 21 వేల 831 శాంపిళ్లను పరీక్షించినట్టు ఐసీఎంఆర్ తెలిపింది.