దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య కోటి దాటింది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో మొదటి స్థానంలో అమెరికా ఉండగా, రెండో స్థానంలో భారత్ ఉంది.
దేశంలో ప్రస్తుతం 1,00,04,599 మందికి కరోనా వైరస్ సోకింది. శుక్రవారం దేశవ్యాప్తంగా 11,71,868 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 27వేల మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. మరో 342 మంది ప్రాణాలు కోల్పోయారు. పేరుకు కోటి కేసులు నమోదైనా… దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది.
దేశంలో యాక్టివ్ కేసుల రేటు 3.09శాతానికి వచ్చింది. అంటే 3,07,079యాక్టివ్ కేసులున్నాయి. 95,49,923మంది కోలుకోగా… రికవరీ రేటు 95శాతంకు పైగా ఉంది. గత వారం రోజులుగా రోజువారి కరోనా మరణాల సంఖ్య 400లోపే నమోదవుతుంది.