ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను మరికొంతకాలం నిలిపివేస్తున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. డిసెంబరు 15 నుండి అంతర్జాతీయ విమానాలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఈమధ్యే ప్రకటించిన అధికారులను దీనిపై పునరాలోచించాలని ప్రధాని మోడీ కోరారు. ఈ నేపథ్యంలో అధికారులు ఈ ప్రకటన చేశారు.
కొత్త వేరియంట్ విజృంభిస్తున్న కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసుల నిషేధం ఇంకొంతకాలం పొడిగిస్తున్నట్లు వెల్లడించింది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇటు ఇప్పటికే 20కి పైగా దేశాల్లో ఒమిక్రాన్ విజృంభణ కొనసాగుతోంది.