భారత దేశానికి చెందిన అతిపెద్ద ఉమెన్ పీస్ కీపర్స్ బెటాలియన్ ఇప్పుడు యూఎన్ మిషన్ లో భాగం కానున్నాయి. యూఎన్ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్న అతిపెద్ద భారతీయ మహిళా యూనిట్ ఇదే కావడం విశేషం. యునైటెడ్ నేషన్స్ ఇంటీరియమ్ సెక్యూర్టీ ఫోర్ లో భాగమైన భారత ఉమెన్ పీస్ కీపర్స్ ప్లాటూన్ సుడాన్ లోని అబేయ్ ప్రాంతంలో విధులు నిర్వర్తించనున్నది. ఈ భారత మహిళా బృందంలో ఇద్దరు ఆఫీసర్లు ఉంటారు. మరో 25 మంది ఇతర ర్యాంక్ ల వాళ్లు ఉంటారని తెలిపారు.
సుడాన్‌లోని అబేయ్ ప్రావిన్సులో విధులు చేపట్టడం సవాల్ తో కూడుకున్న పని. అక్కడ తాజాగా జరిగిన హింస వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం హింస జరిగే ప్రాంతంలో మహిళా దళాలను మోహరించడం సవాలే. అయితే యూఎన్ పీస్ కీపింగ్ మిషన్ కు మన బృందాన్ని పంపడం గొప్ప విషయగా చెప్పవచ్చు.
కాగా 2007లో లిబేరియాలో భారత మహిళా దళం విధులు నిర్వర్తించింది. లిబేరియాలో ఆ మహిళా దళం 24 గంటల పాటు గార్డు డ్యూటీ చేసింది. రాజధాని మోన్ రోవియాలో రాత్రి పూట పెట్రోలింగ్ నిర్వహించారు.
1948 నుంచి ఇప్పటి వరకు 71 యూఎన్ పీస్ కీపింగ్ మిషన్లను నిర్వహించారు. దాంట్లో 49 మిషన్ల కోసం సుమారు రెండు లక్షల మంది భారతీయుల్ని పంపారు. యూఎన్ పీస్ కీపింగ్ ప్రోగ్రామ్ కు భారతీయ మహిళల్ని పంపే సాంప్రదాయం 1960 నుంచి ఉంది. పీస్ కీపింగ్ మిషన్ లో భారతీయ మహిళలకు ప్రత్యేక స్థానం ఉంది. డాక్టర్ కిరణ్ బేడీ, మేజర్ సుమన్ గవాని, శక్తి దేవి లాంటి వాళ్లు యూఎన్ పీస్ కీపింగ్ లో చేశారు.