చెన్నైలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న 2వ టెస్టు మ్యాచ్‌లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి వివాదాస్పద సంఘటన చోటు చేసుకుంది. ఓపెనర్ శుభమన్ గిల్‌ను జాక్ లీచ్ ఔట్ చేయగా.. మొయిన్ అలీ వేసిన ఓ బంతి మరో ఓపెనర్ రోహిత్ శర్మ ప్యాడ్‌ను తాకింది. అయితే దీనికి ఆన్ ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చారు. కానీ ఆ డెసిషన్‌ను ఇంగ్లండ్ చాలెంజ్ చేసింది.
అయితే ఆన్ ఫీల్డ్ నాటౌట్ ఇచ్చాక థర్డ్ అంపైర్ రీప్లేలో చూడగా బంతి ఇంపాక్ట్ ఔట్ సైడ్ అని వచ్చింది. దీంతో థర్డ్ అంపైర్ కూడా ఆన్ ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయాన్ని సమర్థించాడు. ఈ క్రమంలో రోహిత్ నాటౌట్ అని నిర్ణయం ప్రకటించారు. అయినప్పటికీ ఇంగ్లండ్ కెప్టెన్ విసుగుతో అంపైర్ దగ్గర నుంచి పక్కకు వెళ్లిపోయాడు. ఇది వివాదాస్పదంగా మారింది.
రోహిత్ శర్మ బంతిని ఆడినప్పుడు అతని ఫ్రంట్ లెగ్ వెనుక బ్యాట్ ఉంది. ఈ క్రమంలో ఇంపాక్ట్ కూడా ఔట్ సైడ్ అని వచ్చింది. రీప్లేలో అంత స్పష్టంగా కనిపించినప్పటికీ ఇంగ్లండ్ కెప్టెన్ అలా ప్రవర్తించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూస్తుంటే రోహిత్‌ను ఎలాగైనా ఔట్ చేయడమే ఇంగ్లండ్ ప్లేయర్లు లక్ష్యంగా పెట్టుకున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే మరోవైపు ఇంగ్లండ్ అభిమానులు మాత్రం తమ ప్లేయర్లకు మద్దతు పలకడం విశేషం. మ్యాచ్‌లో దేశీయ అంపైర్ల వల్ల ఇంగ్లండ్ 3 వికెట్లను 1 రివ్యూను కోల్పోవాల్సి వచ్చిందని, కనుక తటస్థ అంపైర్లను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ క్రమంలో ఈ విషయం మరింత వివాదాస్పదంగా మారింది.