అంతర్జాతీయ విమానాలపై ఆగస్టు 31 వరకు నిషేధం కొనసాగిస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. మార్చి22 నుండి లాక్ డౌన్ కారణంగా రద్దైన అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం కొనసాగుతుంది. అయితే అన్ లాక్ 3.0 కింద అంతర్జాతీయ విమాన సర్వీసులపై సడలింపులు ఉంటాయని అంతా భావించినా…. దేశములోని కరోనా పరిస్థితులు, విదేశాల్లో కరోనా విజృంభణ దృష్ట్యా నిషేధం కొనసాగుతుందని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
అయితే అమెరికా సహా కొన్ని దేశాలతో జరుగుతున్న బబుల్ ఒప్పందం ప్రకారం సేవలు కొనసాగనున్నాయి. మరోవైపు కార్గో సేవలు సహా DGCI అనుమతి ఉన్న ఇతర అంతర్జాతీయ విమాన సేవలు యధావిధిగా కొనసాగుతాయని కేంద్రం ప్రకటించింది.
ఇక విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీస్కొచేందుకు వందే భారత్ మిషన్ కొనసాగుతుందని… 2500 విమానాలు నడపనున్నట్లు తెలిపింది.