భారత్ లో వైద్యారోగ్య రంగంలో లోటుపాట్లను కరోనా వైరస్ ఎత్తి చూపింది. కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో చేసిన అధ్యయనాలు… ఇండియాలో మంచి నైపుణ్యం ఉన్న వైద్యారోగ్య సిబ్బంది సరిపడా లేరని స్పష్టం చేస్తున్నాయి. డాక్టర్లు, నర్సులు, ఇతర సహాయ వైద్య సిబ్బంది కొరత అధికంగా ఉందని సూచించాయి.
దేశంలో హెల్త్ వర్కర్లు, నర్సులు, డాక్టర్ల నిష్పత్తి 1:7:1 గా ఉంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం అన్ని రాష్ట్రాల్లో కలిపి డాక్టర్లు నర్సుల నిష్పత్తి 1:1 గా ఉండాలని తేల్చింది. ఇండియాలో ప్రతి డాక్టర్ కు కనీసం నలుగురైదు నర్సులు అయినా ఉండాలని సూచించగా, ప్రస్తుతం ముగ్గురు మాత్రమే ఉన్నారు.
పంజాబ్ లో డాకర్లు నర్సుల రేషియా 6-4-1గా ఉండగా, ఢిల్లీలో 4-5-1గా ఉంది. అదే సమయంలో బీహార్, జమ్మూ-కాశ్మీర్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను గమనిస్తే ఒక డాక్టర్ కు కనీసం ఒక నర్సు కూడా లేరు. అలాగే అలోపతి డాక్టర్ల సంఖ్య హిమాచల్ ప్రదేశ్, బీహార్ లో అతి తక్కువగా ఉంది. జనాభాకు తగ్గట్లుగా డాక్టర్లు, నర్సులు లేరని పలు సంస్థలు డేటాతో సహా విశ్లేషిస్తున్నాయి. ఢిల్లీ, పంజాబ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో డాక్టర్లు నర్సుల రేషియా సరిపడా ఉన్నప్పటికీ, 10వేల మంది జనాభాకు ఒక్కరే డాక్టర్ ఉన్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్ లెక్కల ప్రకారం నర్సులు-జనాభా నిష్పత్తి 1:670 ఉండాలి. కానీ డబ్ల్యూహెచ్వో మాత్రం 1:300ఉండొచ్చు అని తెలిపింది.