భారత్ పాకిస్తాన్ మరోసారి తలపడనున్నాయి. అయితే, యుద్ధంలో కానీ.. క్రికెట్ లో కానీ కాదు. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత్.. పాకిస్థాన్‌తో ఆడనుంది. గత మ్యాచ్ లో బంగ్లాదేశ్‌పై 9-0తో ఘన విజయం సాధించిన భారత్.. పాకిస్తాన్ పై కూడా అదే దూకుడు చూపించేందుకు సిద్ధమైంది.
2018 మస్కట్‌లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన పోరులో వర్షం కారణంగా టోర్నీ రద్దైంది. దీంతో, ఇరు జట్లు డిఫెండింగ్ ఛాంపియన్ల హోదాలో ఈసారి బరిలో దిగుతున్నాయి. అయితే, గత అనుభవాలు చూసుకుంటే.. ఈ టోర్నీ ఫైనల్లో భారత్-పాక్ తొమ్మిదిసార్లు తలపడితే పాక్ ఏడుసార్లు విజయం సాధించగా.. భారత్ రెండు సార్లు మాత్రమే గెలిచింది. దీంతో, ఈ మ్యాచ్ పై ఆసక్తి నెలకొంది.