మన దేశ జెండా మన దేశంలో రెపరెపలాడుతుంటే చూస్తేనే మనసుకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. అదే మన దేశం జెండా పక్క దేశంలో కూడా రెపరెపలాడే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అది కూడా అగ్రదేశం లో మన జాతీయ జెండా ఎగిరితే అది భారతీయులందరికీ ఎంతో గౌరవంగా ఉంటుందనే చెప్పాలి. అయితే ఇప్పుడు అది జరగబోతున్నట్టు తెలుస్తోంది. మన జాతీయ జెండాను 75 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమెరికాలో ఉన్న భారతీయులు ఎగరేయబోతున్నారు.
ఆగస్టు 15న న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద ఆరు అడుగుల పొడవు 10 అడుగులాల వెడల్పు ఉన్న జాతీయ జెండాను 25 అడుగుల ఎత్తు ఉన్న జెండా కర్ర పై ఎగరవే బోతున్నారు. అంతేకాకుండా ఆ రోజు బిల్ బోర్డ్ ను త్రివర్ణ పతాకం తో 24 గంటలు ప్రదర్శించబోతున్నారు. దాంతో ఈ ఆగస్టు 15న మన జాతీయ జెండా అమెరికా ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై మెరవనుంది. ఈ వార్త వచ్చినప్పటి నుండి ఆగస్టు 15 కోసం భారతీయులంతా ఎదురుచూస్తున్నారు.