కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2021, మార్చి నెలలో 5జీ స్పెక్ట్రంను వేలం వేయాలని నిర్ణయించారు. 20 సంవత్సరాలకు పలు ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో ఈ 5జీ స్పెక్ట్రం వేలం వేయనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.
ఈ తాజా నిర్ణయం ద్వారా 3,92,332కోట్ల ఆదాయం వస్తుందని కేంద్రం అంచనా వేసింది.