బ్రిటన్ లో కరోనా కొత్త స్ట్రెయిన్ విజృంభిస్తుండటంతో పాటు రాబోయే పండుగ సీజన్, చలికాలం దృష్ట్యా దేశంలోని పలు రాష్ట్రాలు కీలక నిర్ణయం తీసుకుంటున్నాయి. దేశంలో ఒక్కో రాష్ట్రం మరోసారి లాక్ డౌన్ వైపు అడుగులేస్తున్నాయా… అన్నట్లుగా రాష్ట్రాలన్నీ రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని నిర్ణయం తీసుకుంటున్నాయి.
ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూ అమలులో ఉండగా… ఇప్పుడు కర్ణాటకలోనూ రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. రాత్రి 10గంటల నుండి ఉదయం 6గంటల వరకు అత్యవసర సర్వీసులు మినహా అన్నింటికి కర్ఫ్యూ షరతులు వర్తిస్తాయని కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది.
తమిళనాడు, తెలంగాణ, ఏపీ, ఢిల్లీ వంటి రాష్ట్రాలు ఇప్పటికే బ్రిటన్ నుండి వచ్చిన వారి వివరాలు ట్రాక్ చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఇక్కడ ఎలాంటి ఆంక్షలు విధించకపోయినప్పటికీ రాబోయే రెండు వారాలు అలర్ట్ గా ఉండాలంటూ హెచ్చరించటంతో మళ్లీ లాక్ డౌన్ వేస్తారేమో అన్న అనుమానం వ్యక్తం అవుతుంది.