గాల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణ విషయంలో చైనా వ్యాఖ్యలను ఇండియా తిప్పికొట్టింది. ఇండియా తమ భూభాగంలోకి అక్రమంగా చొరబడిందన్న చైనా వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టింది. ఇలాంటివి రెండు దేశాల మధ్య శాంతియుత సంబంధాలను చెడగొడతాయని, స్టేటస్ కో మెయింటెన్ చేయాల్సిన విషయాల్లో దుందుడుకు వ్యాఖ్యలు సరికాదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి బగ్చీ స్పష్టం చేశారు.
జూన్ 15న భారత్, చైనా బలగాల మధ్య గాల్వాన్ లోయలో ఘర్షణ మొదలైంది. ఇందులో 21మంది భారత సైనికులు మరణించగా, చైనా వైపు కూడా చాలా మంది మరణించారు. 1975చైనాతో యుద్ధం తర్వాత ఇలాంటి ఘర్షణలు జరగటం ఇదే ప్రథమం.
భారత దళాలు చైనా భూభాగంలోకి వచ్చినందునే ఘర్షణ జరిగిందని చైనా విడుదల చేసిన స్టేట్మెంట్ పై భారత్ రియాక్ట్ అయ్యింది. సరైన సమయంలో, సరైన వేదికలపై చర్చలు సాగుతున్నందన అనవసరపు కామెంట్స్ వద్దంటూ హితవు పలికింది.