ఆస్ట్రేలియాతో అడిలైడ్ లో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో భారత్ పట్టుబిగించింది. తొలి ఇన్నింగ్స్ లో 244పరుగులకే టీంఇండియా ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియాను అంతకంటే తక్కువకు… 191పరుగులకు ఆలౌట్ చేసింది. స్పిన్నర్ అశ్విన్ మ్యాజిక్ చేసి కీలక వికెట్స్ తీయటంతో భారత్ కు 53 పరుగుల ఆధిక్యం లభించింది.
అశ్విన్ కు నాలుగు వికెట్లు పడగా, ఉమేశ్ యాదవ్ 3, బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు. కోహ్లి అద్భుతమైన క్యాచ్ తో అందర్నీ మెప్పించాడు. ఆస్ట్రేలియా టీంలో టీం పైనీ 73పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కు మరోసారి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫాం లేక ఇబ్బందిపడుతున్న పృథ్వీ షా 4 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు.