కొత్త రకం కరోనా వైరస్ ఆందోళన నేపథ్యంలో బ్రిటన్ నుండి భారత్ కు రావాల్సిన విమానాలపై ఇప్పటి వరకు నిషేధం ఉంది. జనవరి 8వరకు నిషేధం ఉండగా ఆ తర్వాత విమాన సర్వీసులను పున ప్రారంభించాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. అయితే, బ్రిటన్ నుండి వచ్చే వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి అని తెలిపింది. పైగా పరీక్షల ఖర్చును ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.
కొత్త విమాన సర్వీసులు ఈనెల 6 నుండే భారత్ నుండి మొదలవుతాయి. 8వ తేదీ నుండి బ్రిటన్ నుండి ఇండియాకు అనుమతిస్తారు. జనవరి 23 వరకు వారానికి 15 చొప్పున సర్వీసులను మాత్రమే అనుమతించింది.
కొత్త మార్గదర్శకాలు
1. బ్రిటన్ నుండి బయలుదేరే 72గంటల ముందు కోవిడ్ పరీక్ష చేయించుకోవాలి. నెగెటివ్ వస్తేనే ప్రయాణానికి అనుమతి.
2. కరోనా రిపోర్ట్ పరిశీలించే బాధ్యత విమానయాన సంస్థలదే.
3. ఆర్టీపీసీఆర్ పరీక్ష ఫలితం కోసం వేచి చూస్తున్న వారిని ప్రత్యేక క్వారెంటైన్ చేయాలి
4. పాజిటివ్ గా తేలితే 14రోజుల వరకు క్వారెంటైన్, చికిత్స అందించాలి. ప్రయాణ సమయంలో పాజిటివ్ వస్తే సదరు ప్రయాణికుడికి అటు-ఇటు మూడు వరసల ప్రయాణికులను కూడా క్వారైంటైన్ చేయాల్సిందే.
5.