గత మూడు సంవత్సరాల నుంచి పులుల మరణాల గణాంకాలను నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అధికారులు విడుదల చేసింది. ఈ ఏడాది జవనరి 1 నుంచి ఫిబ్రవరి 8 మధ్య కేవలం ఒక నెల వ్యవధిలో భారతదేశంలో 24 పులులు మృతి చెందాయని అధికారులు తెలిపారు. గత ఏడాది ప్రారంభంలో 16 పెద్ద పులుల మరణించాయి. అదే సమయంలో 2021లో 20 మరణాలు నమోదయ్యాయని వెల్లడించింది. గత మూడేళ్ళలో లెక్కల ప్రకారం.. ఈ ఏడాది పులులు అధికంగా మరణించినట్లు తెలుస్తోంది.
మధ్య ప్రదేశ్ లో ఏకంగా 9 పులులు మరణించాయి. మహారాష్ట్రలో 6, రాజస్థాన్ లో 3, కర్ణాటక లో 2, ఉత్తరాఖండ్ లో 2, అస్సాం, కేరళ లో ఒకొక్క పెద్ద పులి చొప్పున మొత్తం ఒక్క నెలలో 24 పెద్ద పులులు మృతి చెందాయి.
ఇక పులుల మరణానికి కారణాలను పరిశీలిస్తే.. వృద్ధ్యాప్యంతో సహా సహజ కారణాలతో పాటు, ప్రాదేశిక పోరాటాలు అని తెలుస్తోంది. అయితే పులుల మృతికి వేటగాళ్ల ఏమైనా కారణమా అనే కోణంలో అధికారులు డేటాను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.
మరోవైపు భారత్ లో అంతరించి పోతున్న చిరుతలను విదేశాల నుంచి తీసుకుని మళ్లీ పెంచే విధంగా ప్రాజెక్టును రూపొందించింది. ‘ప్రాజెక్ట్ చిరుత’ ను భారత్ చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ కింద వన్య జాతులను ప్రత్యేకించి చిరుతలను సంరక్షించడం కోసం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ మార్గదర్శకాల ప్రకారం చిరుతలను భారతదేశానికి తీసుకువస్తున్నారు. ఈ ప్రాజెక్టు కింద ఇప్పటివరకు 20 చిరుతలను భారత్‌కు తీసుకొచ్చారు.