హ్యాకర్లు మరోసారి రెచ్చిపోయారు. భారత వాతావరణ శాఖ అధికారిక ట్విట్టర్ ఖాతాను శనివారం హ్యాక్ చేశారు. ఐఎండీ ఖాతాను 2.46 లక్షల మంది అనుసరిస్తున్నారు. వెబ్ సైట్ ను తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీనిపై ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ మహాపాత్రో స్పందించారు.
‘ఐఎండీ అధికారిక ట్విట్టర్ ఖాతా శనివారం హ్యాకింగ్ గురైంది. దాన్ని పునరుద్దరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు’ అని ఆయన మృత్యుంజయ శర్మ ట్వీట్ చేశారు.
అంతకు ముందు శనివారం ఉదయం యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ అధికారిక ఖాతా హ్యాక్ అయింది. సమారు గంటన్నర పాటు ఆయన ఖాతా హ్యాకర్ల ఆధీనంలో ఉండిపోయింది. ఆయన ప్రొఫైల్ పిక్ స్థానంలో కార్డూన్ చిత్రాలను హాకర్లు పెట్టారు. దాదాపు 300లకు పైగా ట్వీట్లను హ్యాకర్లు చేసినట్టు తెలిసింది.
శనివారం ఉదయం 12.43 గంటలకు ఆయన ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కు గురైంది. దీంతో అధికారులు వెంటనే స్పందించి దాన్ని పునరుద్దరించేందుకు ప్రయత్నాలు చేశారు. ఉదయం 1.20 గంటల ప్రాంతంలో సీఎం ట్విట్టర్ అకౌంట్ ను అధికారులు తిరిగి పునరుద్ధరించారు.