కరోనా వ్యాక్సిన్ డోసుల కొనుగోలులో ఇండియా ముందు జాగ్రత్తపడుతోంది. ప్రపంచంలోనే ఇప్పటివరకు అత్యధిక కరోనా టీకా డోసులు కొనుగోలు చేసినన దేశంగా భారత్ రికార్డు సాధించింది. ఇండియా ఇప్పటివరకు 1600 మిలియన్లకుపైగా టీకా డోసుల కొనుగోళ్ల కోసం ఒప్పందాలు చేసుకుందని యూఎస్‌కి చెందిన డ్యూ వర్సిటీ నివేదిక బయటపెట్టింది.
ఇక ఇండియా తర్వాత దాదాపు 1500 మిలియన్ల డోసులతో యూరోపియన్ యూనియన్ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత 1000 మిలియన్ల డోసులతో అమెరికా మూడో స్థానంలో ఉందని తెలిపింది . ఇదే సమయంలో జపాన్, కెనడా, యూకే వంటి దేశాలు ఇప్పటివరకు 400 మిలియన్ల కంటే తక్కువ టీకా డోసులనే కొనుగోలు చేశాయని డ్యూక్ యూనివర్సిటీ తెలిపింది.
వ్యాక్సిన్ కొనుగోళ్ల సంగతి ఎలా ఉన్నా.. .ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ టీకా లభించడానికి 2023 లేక 2024 వరకు పట్టొచ్చని ఆ నివేదిక తెలిపింది.