ప్రపంచంలో డ్రగ్స్ వాడకంతో పోలిస్తే ఇండియాలో తక్కువే అయినా డ్రగ్స్ వాడకం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. పొరుగున ఉన్న దేశాల్లో ఓపీయం పండిస్తుండటంతో అది ఇండియా మీదుగా ఎన్నో దేశాలకు ఎగుమతి అవుతూనే ఉంది. ఇటీవల దొరికిన 21వేల కోట్ల విలువ చేసే డ్రగ్స్ భారత్ ను ఉలిక్కిపడేలా చేసింది.
నిజానికి ఓపీయం పండించే దేశాల్లో అప్ఘనిస్తాన్ ముందు వరుసలో ఉంది. తాలిబన్లకు ప్రధాన ఆదాయ వనరు ఇదే. ఇటీవల గుజరాత్ పోర్టులో దొరికిన 3వేల కిలోల డ్రగ్స్ అఫ్ఘన్ నుండి ఇరాన్ మీదుగా గుజరాత్ పోర్టు నుండి షిప్పింగ్ అవుతుంది. ఇంత భారీ మొత్తంలో ఓకేసారి నిర్భయంగా డ్రగ్స్ సరఫరా చేయటం చాలా పెద్ద విషయమే. నిజానికి కరోనా వైరస్ వల్ల చాలా పోర్టుల్లో ఎగుమతులు, దిగుమతులు తగ్గాయి. ఓ దశలో మొత్తం వ్యవస్థ రెండు నెలల పాటు పడకేసింది. దీంతో డ్రగ్స్ సప్లై పై ఆ ప్రభావం తీవ్రంగా ఉంది.
దీంతో ఆప్ఘన్ ఇరాన్ మీదుగా భారత దేశ దక్షిణ ప్రాంతంలో ఉన్న పోర్టుల వెంబడి శ్రీలంక, మారియస్, కొన్ని యూరిపియన్ దేశాలతో పాటు ఆఫ్రికా దేశాలకు డ్రగ్స్ ఎగుమతి చేస్తుంది. కానీ ఇది రాబోయే కాలంలో ఇండియాకు పెను ప్రమాదం కాబోతుంది. ఇప్పటికైతే పోలీసులు, ఇంటలిజెన్స్ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తూ డ్రగ్ రాకెట్స్ ను బట్టబయలు చేస్తుంది. కానీ ఈ ఎగుమతులు, షిప్పింగ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు ప్రారంభించకపోతే పెను ముప్పుగా మారే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు.