కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో శీతాకాల పార్లమెంట్ సమావేశాలను వాయిదా వేసిన కేంద్రం… బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్ చేసింది. మొత్తం రెండు దఫాలుగా ఈ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 29 నుండి పార్లమెంట్ సమావేశాలు మొదలవుతాయి.
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మార్చి 8 నుండి రెండో దశ సమావేశాలు ప్రారంభం కానుండగా… ఏప్రిల్ 8తో సమావేశాలు ముగియనున్నాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో అన్ని జాగ్రత్తలతో సమావేశాలు జరుగుతాయని స్పష్టం చేసింది.