వొడాఫోన్ గ్రూప్ కు అనుకూలంగా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సింగపూర్ కోర్టులో భారత్ సవాల్ చేసింది. వొడాఫోన్ గ్రూప్ ఐటీ శాఖకు 22,100 కోట్ల పన్ను కట్టాలన్న ఆదేశాలను… ఈ ఏడాది సెప్టెంబర్ 25 న ఆర్బిట్రేషన్ కోర్టు తోసిపుచ్చింది. దీన్ని90 రోజుల్లోగా సవాల్ చేసుకునే అవకాశాన్ని కల్పించడంతో భారత్ సింగపూర్ కోర్టును ఆశ్రయించింది. అప్పీల్ కు చివరి రోజున భారత్ పిటిషన్ వేయటం గమనార్హం.
వొడాఫోన్-హచిసన్ లావాదేవీలలో 2007 లో ఐటీ శాఖ 7,990 కోట్ల పన్ను డిమాండ్ చేసింది. రెట్రాస్పెక్టివ్ గా ఈ మొత్తం 22,100 కోట్లుగా తేలడంతో నెదర్లాండ్స్-భారత్ ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం కింద వొడాఫోన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. దీంతో కోర్టు ఖర్చులు, వొడాఫోన్ ఆర్బిట్రేటర్ ఖర్చులకుగాను 85 కోట్లు చెల్లించాలని కూడా స్పష్టం చేసింది.