ఇండియాలో జరుగుతున్న పరిణామాలపై డేగ కన్నుతో కనిపెడుతున్న పాక్… ఇవన్నీ చూస్తుంటే సెక్యూరిటీ, సెఫ్టీ విషయంలో అనుమానించాల్సి వస్తుందని ట్వీట్ చేసింది.
We have noted with serious concern yet another report of theft & illicit sale of #radioactive material in #India. This is the third such occurrence in India in the last four months. 1/2
— Spokesperson 🇵🇰 MoFA (@ForeignOfficePk) August 30, 2021
Advertisements
అయితే, పాక్ చెప్పినట్లుగా మూడు చోట్ల బయటపడ్డది అణుబాంబులకు సంబంధించిన కాలిఫోర్నియం మెటీరియల్ కాదని భారత వర్గాలు తేల్చి చెప్పాయి. పశ్చిమ బెంగాల్, లక్నోలో దొరికినవి అసలు రేడియో యాక్టివ్ పదార్థాలే కాదని స్పష్టం చేశాయి. అయితే, మూడోది ముంబైలో గుర్తించినప్పటికీ అది అంతా అనుకున్నంత ప్రమాదమైనది కాదని స్పష్టం చేస్తున్నాయి. పైగా ఈ మూడు ప్రాంతాలకు ఎక్కడా లింక్ లేదని తెలిపాయి.
ఇవన్నీ లోకల్ అవసరాలకు చేస్తున్న బ్లాక్ మార్కెట్ గా గుర్తించామని… అంతకు మించి భయపడాల్సిందేమి లేదని భారత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మైనింగ్ లో భాగంగా ఇవి వాడుతున్నట్లు తెలిపాయి.
మొదట మే 5న ముంబైలో ఓ కేసు రిజిస్టర్ అయ్యింది. యురేనియం సరఫరా చేస్తున్నారని, 21కోట్ల విలువ చేసేది సీజ్ అయినట్లు ముంబై యాంటీ టెర్రర్ స్క్వాడ్ తెలిపింది. దీనిపై ఎన్.ఐ.ఏ విచారణ జరిపి… ఇది అంత ప్రమాదకారి కాదని, దాని విలువ 50వేలకు మించి ఉండదని తేల్చింది. ఇందులో కుట్ర కోణం లేదని స్పష్టం చేసింది.
మే 27న లక్నోలో మరో కేసు రిజిస్టర్ అయ్యింది. బెంగాల్ కు చెందిన ఓ వ్యక్తి రెండు కాలిఫోర్నియం ముక్కలు అమ్ముతున్నట్లు గుర్తించారు. వాటి విలువ 12లక్షలుంటుందని అంచనా వేశారు. అయితే, దాన్ని ల్యాబ్ కు పంపగా… అది అసలు రేడియో యాక్టివ్ పదార్థమే కాదని తేలింది. ఇదో చీటింగ్ ఇష్యూ అని తేల్చారు. మూడో కేసు బెంగాల్ లో నమోదు కాగా… కాలిఫోర్నియం అనే అనుమానంతో ల్యాబుకు పంపగా అది కూడా ఫేక్ అని తేలింది. అది ఒక ఫేక్ సింథటిక్ మెటీరియల్ అని తేల్చారు.