దేశంలో ఓ వైపు కరోనా కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి మొదవలవుతున్న సందర్భంలో… దేశంలో కరోనా కేసుల సంఖ్య 20వేల దిగువన నమోదవుతుంది. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 19,078 కేసులు నమోదయ్యాయి. చికిత్స పొందుతూ మరో 224 మంది ప్రాణాలు కోల్పోయారు.
మొత్తం కేసులు- 1,03,05,788
యాక్టీవ్ కేసులు- 2,50,183
కోలుకున్నవారు- 99,06,38
మరణాలు- 1,49,218
5 రాష్ట్రాల్లోనే 62 శాతం యాక్టివ్ కేసులు
దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో కేరళ, మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్, బంగాల్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోనే 62 శాతం యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 96.08 శాతంగా నమోదైంది.