దేశంలో కరోనా వైరస్ దావనంలా వ్యాపిస్తుంది. ప్రతి రోజు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా ఏకంగా 89,129మందికి వైరస్ సోకింది. మరో 714మంది మరణించారు.
మొత్తం కేసులు: 1,23,92,260
మొత్తం మరణాలు: 1,64,110
కోలుకున్నవారు: 1,15,69,241
యాక్టివ్ కేసులు: 6,58,909
దేశంలో కరోనా కేసుల వ్యాప్తి ఇలాగే ఉంటే… ఏప్రిల్ 15-20వ తేదీ వరకు కేసుల సంఖ్య ఊహించనంత ప్రమాదకరంగా ఉంటుందని, ఆసుపత్రుల బెడ్లు ఏమాత్రం సరిపోవని… అంత్యక్రియలు చేయలేక శవాల గుట్టలు పేరుకపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.