భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి నిలకడగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 23 వేల 68 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో దేశంలో కరోనాబారినపడిన బాధితుల సంఖ్య ఒక కోటీ లక్షా 46 వేల 846కు పెరిగింది. ఇక నిన్న మరో 336 మంది కరోనాతో మరణించారు. వీరితో కలిపి దేశంలో కరోనా మృతుల సంఖ్య లక్షా 47 వేల 92కు చేరింది.
మరోవైపు తాజాగా కరోనా మహమ్మారి నుంచి కొత్తగా 24 వేల 661 మంది కోలుకున్నాఉ. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 97.17 లక్షలకు పెరిగింది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్‌తో బాధపడుతున్నవారు 2.81 లక్షల మంది ఉన్నట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇదిలా ఉంటే కొత్తగా బ్రిటన్, దక్షిణ ఆఫ్రికా, నైజీరియాలో వెలుగుచూసిన కరోనా వైరస్ రకం ఏదీ ఇండియాలో వెలుగుచూడలేదని స్పష్టం చేసింది.