సెకండ్ వేవ్ ముంచుకొస్తోందా అన్న రీతిలో మూడు రోజులుగా 14 వేలకు పైగా కేసులతో భయపెట్టిన కరోనా వైరస్.. కాస్త శాంతించింది. చాలా రోజుల తర్వాత మళ్లీ 10 వేల కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 10,584 మంది కొత్తగా కరోనా వైరస్ బారినపడ్డారు. కరోనా కారణంగా మరో 78 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే కరోనా వైరస్ బారినపడినవారిలో తాజాగా 13,255 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. వ్యాక్సినేషన్‌లో భాగంగా కోటీ 17లక్షలకుపైగా మందికి టీకా వేసినట్టు వెల్లడించింది.
ఇప్పటివరకూ నమోదైన కేసులు: 1,10,16,434
కోలుకున్న బాధితులు: 1,07,12,665
కరోనా కారణంగా మరణించిన వారు: 1,56,463
ప్రస్తుతం యాక్టివ్ కేసులు: 1,47,306