దేశంలో కొత్త వేరియంట్ స్పీడ్ చూస్తుంటే థర్డ్ వేవ్ టెన్షన్ ను మరింత పెంచుతోంది. అసలే కరోనా కేసుల్లో భారీ పెరుగుదల నమోదవుతుండగా.. ఒమిక్రాన్ కూడా జత కలిసింది. తాజాగా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 358కి పెరిగింది. కేవలం ఒక్కరోజులోనే వందకు పైగా కేసులు నమోదయ్యాయి.
ఒమిక్రాన్ కేసుల్లో మహారాష్ట్ర టాప్ ప్లేస్ లో ఉంది. అక్కడ అత్యధికంగా 88 మంది వైరస్ బారినపడ్డారు. 67 కేసులతో ఢిల్లీ రెండో స్థానంలో.. తెలంగాణ (38) మూడో ప్లేస్ లో ఉన్నాయి. తమిళనాడు (34), కర్నాటక (31), గుజరాత్ (30), కేరళ (27), రాజస్థాన్ (22), హర్యానా, ఒడిశా (4), జమ్మూకాశ్మీర్, బెంగాల్ (3), ఏపీ, యూపీ (2), చండీగఢ్, లద్దాఖ్, ఉత్తరాఖండ్ (1) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన 358లో ఇప్పటివరకు 114 మంది కోలుకున్నారు. తమిళనాడులో ఒక్కసారిగా కొత్త వేరియంట్ కేసులు బయటపడ్డాయి. బుధవారం వరకు అక్కడ ఒక్క కేసు మాత్రమే ఉండగా.. గురువారం ఒక్కరోజే 33 వెలుగుచూశాయి. మహారాష్ట్ర, కర్నాటకల్లో కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది.