భారత్‌లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నట్టుగా కనిపిస్తోంది. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కొత్త కేసుల్లో పెరుగుదల నమోదైంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 12,881 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక కరోనాకు చికిత్స పొందుతూ నిన్న 101 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారిన పడి ఇప్పటివరకు 1,56,014 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,50,201 కి చేరింది. ఇందులో ఇప్పటికే 1,06,56,845 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,37,342 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇక తెలంగాణలోనూ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో తాజాగా 163 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనా కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,113 కి చేరింది. ఇప్పటివరకు 1,622 మంది మృతి చెందారు. ప్రస్తుతం 1,700 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు ఈ మహమ్మారి బారి నుంచి కోలుకుని 2,93,791 మంది డిశ్చార్జ్ అయ్యారు.