దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,144 కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనాకు చికిత్స పొందుతూ నిన్న మరో 181 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు తాజాగా ఈ వైరస్ బారి నుంచి 17,170 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇప్పటివరకు నమోదైన కేసులు: 1,05,57,985
కోలుకున్నవారు : 1,01,96,885
యాక్టివ్ కేసులు : 2,08,826
మరణాలు: 1,52,274
ఇక కరోనా కొత్త స్ట్రెయిన్ వివరాలకు వస్తే.. ఇప్పటివరకు దేశంలో116 మందిలో బయటపడినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. శుక్రవారం 114గా ఉండగా.. శనివారం నాటికి 116కు పెరిగినట్టు వెల్లడించింది. కాగా, కొత్త వేరియంట్ బారినపడిన వారిని స్పెషల్ ఐసొలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.