దేశంలో మరోసారి కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16505 కేసులు నమోదయ్యాయి. గత వారం రోజుల్లో ఇంత తక్కువ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇది రెండోసారి. కాగా కరోనా విజృంభించకముందు ఈ స్థాయిలో జూన్ 24న 16,922 కేసులు వెలుగుచూశాయి. ఇక కరోనా కారణంగా నిన్న 214 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా కేసులతో కలిపి మొత్తం 1,03,40,470 కు చేరాయి. కరోనాతో చికిత్స పొందుతూ ఇప్పటివరకూ 1,49,649 మంది మరణించారు. మొత్తం బాధితుల్లో 99.46 లక్షల మంది ఇప్పటికే కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 2.44 లక్షల కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా నిన్న 7.34 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీటితో కలిపి ఇప్పటిదాకా 17.56 కోట్ల శాంపిళ్లను పరీక్షించినట్టు ఐసీఎంఆర్ తెలిపింది.