దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నిలకడగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16, 946 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ ప్రభావాన్ని తట్టుకోలేక మరో 198 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక 17,652 మంది నిన్న కరోనా నుంచి కోలుకున్నారు.
ఇప్పటివరకు నమోదైన కేసులుః 1,05,12,093
కోలుకున్నవారుః 1,01,46,763
మరణాలుః 1,51,727
యాక్టివ్ కేసులుః 2,13,603
దేశవ్యాప్తంగా నిన్న 7.43 లక్షల మంది కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపింది. వీటితో కలిపి ఇప్పటివరకు 18.42 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించింది.